: ఆంగ్ల భాషపై రాజ్ నాథ్ కు అంత ఆగ్రహం ఎందుకో?


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆంగ్ల భాషపై ఆగ్రహం వెళ్ళగక్కారు. ఇంగ్లిష్ వల్ల భారతీయ భాషల మనుగడే ప్రశ్నార్థకమైందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. చివరికి దేశ ప్రజలు తమ సంస్కృతిని సైతం మరిచారంటే కారణం ఈ ఆంగ్ల భాషే అని మండిపడ్డారు. ఢిల్లీలో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్.. టీవీ చానళ్ళ ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్ దెబ్బకు సంస్కృత భాష మాట్లాడేవాళ్ళు 14 వేలమంది మిగిలారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లాన్ని ఉపయోగించుకుని విజ్ఞానాన్ని సముపార్జించుకోవడంలో తప్పులేదని, కానీ, ఆ మ్లేచ్ఛ భాషా సంస్కృతిని అలవర్చుకోవాలనుకోవడం పొరబాటని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News