: చప్పగా ముగిసిన క్యాబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్ భేటీ సాధారణ అజెండాకే పరిమితమైంది. రాజకీయ చర్చకు తావివ్వకుండా పథకాలు, పంచాయతీ ఎన్నికలపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ముగించారు.