: గుంటూరు జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారు స్వాధీనం


గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ28 బీహెచ్ 7779 నెంబరు కలిగిన ఈ వాహనం ముందు భాగంలో అద్దంపై అసెంబ్లీ పాస్ అతికించి ఉంది. వాహన తనిఖీల్లో భాగంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దంగా తిరుగుతున్న ఈ కారును ఆపి ప్రశ్నించారు. వాహన వివరాల రికార్డుల్లో ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల వాహనంగా రికార్డయి ఉంది. కాగా దీన్ని రేవేంద్రపాడు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దమయంతి కుమారుడు వేణు ఉపయోగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం దీన్ని కొనుగోలు చేశామని వారు పోలీసులకు తెలిపారు. ఆ మేరకు మార్పులు చేయలేదన్నారు. నాలుగేళ్ల క్రితం వేసిన స్టిక్కర్ అలాగే ఉందని తెలపడం, దాన్ని పోలీసులు నమ్మడం మన అధికారుల తీరుకు నిదర్శనం అని స్థానికులు అంటున్నారు.

  • Loading...

More Telugu News