: వాచీలో గోవిందం


గడియారాల తయారీదారు సెంచరీ సంస్థకు ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది. వాచీల్లో తిరుపతి శ్రీవెంకటేశ్వరుడి ప్రతిమను పొదిగి వాటిని వేలం వేసి వచ్చిన ఆదాయంలో 33 శాతం టీటీడీ అనుబంధ బర్డ్ ట్రస్టుకు అందివ్వాలన్నదే సదరు సంస్థ యోచన. అయితే, వీటిని పరిమిత సంఖ్యలోనే తయారు చేస్తారట. ఈ వాచీలను హైదరాబాదులో గురువారం ఆవిష్కరించనున్నారు.

 ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొంటారు. ఇందులో విశేషమేమిటంటే.. శ్రీవారి గడియారాలను తయారు చేసింది స్విట్జర్లాండ్ లో. బహిరంగ వేలం వేయనుంది లండన్ లో. ఈ మొత్తం ప్రక్రియలో టీటీడీకి ఎలాంటి వ్యయప్రయాసలు లేకపోవడంతో వెంటనే ఓకే చెప్పేసింది. ఒక్క వాచీకి రెండు పిట్టల్లా.. విదేశాల్లో హైందవ ధర్మ ప్రచారం జరగడం, ఇటు బర్డ్ ట్రస్టుకు కోట్ల రూపాయల మేర నిధులు సమకూరడం సాధ్యమవుతాయి. 

  • Loading...

More Telugu News