: బీజేపీ అజెండాపై అన్నా హజారే కామెంట్


సామాజిక కార్యకర్త అన్నా హజారే భారతీయ జనతా పార్టీ అజెండాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అజెండా మొత్తం మత సంబంధమైనదేనని విమర్శించారు. తానెప్పుడూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన హజారే.. మోడీ మతవాది కాడని తానెప్పుడూ అనలేదన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలోనూ నిజాయతీ కలిగిన 'ప్రధానమంత్రి అభ్యర్ధి' అంటూ ఎవరూ లేరని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News