: సినీ పండుగకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి
భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్నారు. సీపీఐ ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, ఇతర కార్యదర్శులు కలిసి ఈరోజు రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఇందుకు ఆయన అంగీకరించారు. చెన్నై వేదికగా సెప్టెంబర్ లో 25, 26, 27 తేదీల్లో దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమా రంగాలు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.