: అనిల్ తప్పులను బయటపెట్టండి బొత్సగారూ..: వర్ల డిమాండ్


బ్రదర్ అనిల్ చేసిన తప్పులను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బయటపెట్టాలని తెలుగుదేశం నేత వర్ల రామయ్య డిమాండు చేశారు. తప్పులు వెల్లడిస్తే ప్రజలు కూడా ఆయన గురించి తెలుసుకుంటారని అన్నారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో వర్ల మాట్లాడుతూ.. వైఎస్ పై బొత్స చేసిన బ్రాందీ వ్యాఖ్యలను ప్రసావిస్తూ, ఎవరెంత తాగారో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అయితే, ఖద్దర్ మాటున కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. నిన్న పీసీసీ చీఫ్ బొత్స మీడియాతో మాట్లాడుతూ, అనిల్ ఏ తప్పు చేసి తన వద్దకు వచ్చాడో తెలుసుకోవాలని షర్మిలకు సూచించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News