: ముంబయి కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నేడు ముంబయి కోర్టుకు హాజరయ్యాడు. 2002లో పూటుగా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనలో ఫుట్ పాత్ పై పడుకున్న ఐదుగురిపై నుంచి కారు దూసుకెళ్లింది. వీరిలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడపడమే కాకుండా, క్షతగాత్రులను పట్టించుకోకుండా తప్పించుకుని పారిపోయారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు రుజువైతే సల్మాన్ కు పదేళ్లు జైలు శిక్షపడే అవకాశముంది. ఈ రోజు కోర్టుకు సల్మాన్ తన ఇద్దరు సోదరీమణులతో కలిసి హాజరయ్యారు. ఈ కేసును వచ్చే బుధవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. సల్మాన్ ఖాన్ 1998లో జింకను వేటాడిన కేసులో మూడు రోజులు జైల్లో గడిపిన సంగతి తెలిసిందే.