: రణబీర్ తో కత్రినా రహస్య విందు
ప్రియుడు రణబీర్ కపూర్ తో తన పుట్టిన రోజు సంబరాలను రహస్యంగా జరుపుకుంది కత్రినాకైఫ్. మంగళవారం కత్రినా 31వ పుట్టిన రోజు. సోమవారం రాత్రి 9 గంటలకే రణబీర్ ముంబైలోని బాంద్రాలో కత్రినా ఇంటి గుమ్మం ముందు వాలిపోయాడు. కత్రినాను తీసుకుని కారులో దక్షిణ ముంబైలోని లగ్జరీ హోటల్ కు వెళ్లాడు. అక్కడ మరికొందరు మిత్రులతో కలిసి విందు ముగించారు. అక్కడే పుట్టిన రోజు శుభాకాంక్షలతో కత్రీనాను ఖుషీ చేసి మళ్లీ మంగళవారం తెల్లవారు జామున ఇంట్లో వదిలి వెళ్లాడు రణబీర్ కపూర్. ఇటీవలే వీరిద్దరూ స్పెయిన్ లో రహస్య విహారయాత్ర ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిందే.