: కాశ్మీర్లో ఆరుకు పెరిగిన కాల్పుల మృతులు
జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. 25 మందికి గాయాలయ్యాయి. స్థానిక యువకుడిని అర్ధరాత్రి వేళ బీఎస్ఎఫ్ గస్తీ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నించిందని తెలియడంతో నిన్న స్థానికులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపుతప్పి కాల్పులకు దారి తీసింది. దీంతో అల్లర్లు కాశ్మీర్ లోయ నుంచి చినాబ్ వ్యాలీకి విస్తరించాయి. వేర్పాటు వాదులు మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితులలో, ప్రముఖ పట్టణాలలో కర్ఫ్యూను విధించి, భద్రతను భారీగా పెంచారు. కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి షిండే విచారణకు కూడా ఆదేశించారు. తాజా అల్లర్ల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.