: సబిత, ధర్మానలపై విచారణ వాయిదా
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల జ్యుడీషియల్ కస్టడీ పిటిషన్ పై విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఈ విచారణను హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ ఉదయం వాయిదా వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరినీ విచారించేందుకు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ ఈ పిటిషన్ వేసింది. ధర్మాన వాన్ పిక్ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి ఓఎంసీకి అక్రమ మైనింగ్ లీజులు జారీ చేసినట్టు ఆరోపణలెదుర్కొంటున్నారు.