: తుని నడిబొడ్డున కాల్పుల కలకలం
తూర్పుగోదావరి జిల్లా తునిలో పట్టపగలు జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని ఉడిపి హోటల్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ దుండగులు ఓ వ్యక్తిపై ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు మిస్ ఫైర్ కావడంతో ఎస్ బీఐ ఏటీఎం అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ దుండగులు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను తమవెంట తీసుకుని వెళ్లారు. అసలు వారు నిజంగా టాస్క్ ఫోర్స్ పోలీసులేనా? అయితే, జనసమ్మర్ధం ఉన్న చోట ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? అనే వివరాలు ఎవరికీ అంతుబట్టడంలేదు. పత్రికా ప్రతినిధులు అడిగేంతవరకూ చివరికి జిల్లా ఎస్పీకి కూడా ఈ విషయం తెలియకపోవడం విశేషం.