: బరువు తగ్గాలంటే వ్యాయామం చెయ్యక్లరేదట!


అధిక బరువు ఉండేవారు బరువు తగ్గేందుకు వ్యాయామం చేస్తుంటారు. అలాగే శరీరం ఫిట్‌గా ఉండేందుకు కూడా ఎక్కువమంది వ్యాయామం చేస్తుంటారు. అయితే ఇలా వ్యాయామం చేయకుండానే కేవలం ఒక టాబ్లెట్‌తో వ్యాయామం చేసిన లబ్ది పొందితే... భలే ఉంటుంది కదూ. ఇలాంటి టాబ్లెట్లే వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫ్లోరిడాలోని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు తాజాగా ఒక మందును కనుగొన్నారు. ఈ మందును శరీరంలోకి ఎక్కించడం వల్ల అది మన జీవక్రియలను పెంచడమే కాకుండా నిద్రను ప్రభావితం చేసే ఆఈవీ-ఈఆర్బీ ప్రోటీన్‌ స్థాయిలను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాము రూపొందించిన ఔషధాన్ని వారు ఎలుకలపై ప్రయోగించగా అది మంచి ఫలితాలనే ఇచ్చిందట. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో వ్యాయామం చేయకుండానే దానివల్ల కలిగే ప్రయోజనాలను అందించే మాత్ర కూడా ఒకటి తయారు కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News