: ఆర్ధికంగా ఎదిగినా ఆ దేశాలు వెనుకబడే వున్నాయి!


తమ దేశాభివృద్ధిని బట్టి ఆయా దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా నిలుస్తాయి. అయినా కూడా ఆ దేశాల్లో మాత్రం నిరుద్యోగం తాండవిస్తూనే ఉంటుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద 20 ఆర్ధిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో ఉద్యోగాల వృద్ధి ఇంకా బలహీనంగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ ఆర్ధిక సహకార అభివృద్ధి సంస్థ హెచ్చరిస్తున్నాయి.

జీ-20 దేశాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోనే ఉత్పత్తికి 80శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే ఈ దేశాలు ప్రభుత్వాలను ఉత్తేజపరిచే ఉద్దేశంతో కొత్త గణాంకాలను రూపొందిచాయి. ఈ వివరాల ప్రకారం గత 12 నెలల్లో జీ-20 దేశాల్లో నిరుద్యోగం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఇంకా పది దేశాల్లో నిరుద్యోగం ఎక్కువగానే ఉంది. దక్షిణాఫ్రికా, స్పెయిన్‌లో నిరుద్యోగం శాతం అత్యధికంగా 25 శాతానికి పైగానే ఉంది. యూరోపియన్‌ యూనియన్‌లో మొత్తం మీద 11 శాతానికి పైగాను, బ్రిటన్‌, కెనడా, టర్కీ, అమెరికాల్లో 7 శాతానికి పైగాను నిరుద్యోగం ఉంది. చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియాల్లో 5 శాతం కన్నా తక్కువగా ఉంది. మొత్తం నిరుద్యోగుల్లో సుమారుగా 30 శాతం మంది ఏడాదికి పైగా ఉపాధి లేకుండా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News