: తెలంగాణపై ఫైనల్ డేట్... సీడబ్ల్యూసీ సమావేశం 28న!
ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యులు ఆ రోజు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయినట్టు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణపై ప్రధానంగా చర్చించనున్నారని, ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఏదో ఒకటి తేల్చేస్తారని అనుకుంటున్నారు. సమావేశం తరువాత ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నేతలంటున్నారు.