: అస్త్రాలకు పదును పెడుతున్న కమలనాథులు
రాబోయే 2014 సాధారణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎన్నికలకోసం పనిచేయాల్సిన జట్టును ఎంపిక చేసేందుకు పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్, , మురళీ మనోహర్ జోషి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ తదితరులు హాజరయ్యారు.
వివిధ కమిటీలకు నేతలను ఎంపిక చేయాల్సి ఉండటంతో, మోడీ నాయకత్వంలో పనిచేసే జట్టును ఎంపిక ఈ రోజే పూర్తిచేసే అవకాశం కనబడుతోంది. మోడీని పార్టీ ఎన్నికల కమిటీ సారథిగా ఎన్నుకోవడంపై నెలరోజుల కిందట అలక వహించిన అద్వానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తిరిగి శాంతించిన ఆయన మోడీతో కలిసి ఈ రోజు సమావేశం కావడంతో బీజేపీ కార్యకర్తలు, నేతలలో ఉత్సాహం వెల్లివిరిసింది.