: ఆండీ ముర్రేకి అరుదైన గౌరవం
ఇంగ్లండ్ టెన్నిస్ చరిత్రలో ఆండీ ముర్రేది చెరగని స్థానం. వింబుల్డన్ గెలవడం ద్వారా ఏడున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసిన ఆండీ ముర్రేకు అరుదైన గౌరవం కల్పించాలని బ్రిటన్ ప్రభుత్వం సంకల్పించింది. దీంతో అతని పేరు మీద స్టాంపును విడుదల చేయనుంది. బ్రిటన్ తరుపున తాజా వింబుల్డన్ లో ముర్రే విజేతగా నిలవగా, 77 ఏళ్ల క్రితం పెర్రీ ఈ విజయం సాధించాడు. స్టాంపులో కేవలం ముర్రే ముఖచిత్రమే కాకుండా, నాలుగు భాగాలు గా విభజించి వాటిల్లో రెండింట్లో ముర్రే అవార్డు తీసుకుంటున్నట్టు ఉంటే, రెండు అతని ఆటతీరు ప్రదర్శించే చిత్రాలు ఉంటాయి. ఈ స్టాంపులు ఆగస్టు 8 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.