: తమిళనాడులోనూ వికటించిన మధ్యాహ్న భోజనం
బీహార్లో 'మధ్యాహ్న భోజనం' విషాదాన్ని మరువక ముందే తమిళనాడులోని నైవేలి ప్రభుత్వ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 102 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే, వారికి సరైన చికిత్స లభిస్తోందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.