: త్వరలో తెలంగాణపై నిర్ణయం : షిండే
తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇందుకు కాలపరిమితి లేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే కోర్ కమిటీ భేటీ అనంతరం తెలంగాణ అంశాన్ని తేల్చే బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి బదలాయించిన సంగతి తెలిసిందే. షిండే తాజా వ్యాఖ్యలు చూస్తుంటే సీడబ్ల్యూసీ సమావేశం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
కాగా, జమ్మూ కాశ్మీర్ లోని రామ్ బన్ లో జరిగిన కాల్పుల ఘటనపై షిండే విచారణకు ఆదేశించారు. ఈ ఉదయం ఆందోళకారులపై బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. కొంతమంది గాయపడ్డారు.