: అమితాబ్ కు 'ఇంటర్నేషనల్ మ్యాస్ట్రో' అవార్డు


బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ను మరో అవార్డు వరించింది. ప్రముఖ నిర్మాత సుభాష్ ఘాయ్ కి చెందిన ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ విజ్లింగ్ వుడ్స్ 'ఇంటర్నేషనల్ మ్యాస్ట్రో' అవార్డుతో అమితాబ్, హరిప్రసాద్ చౌరాసియా, శివకుమార్ శర్మలను సత్కరించింది. అమితాబ్ బచ్చన్ చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు ఈ అవార్డు అందుకోగా, వేణుగానం విద్వాంసుడిగా విశేష ప్రతిభ చూపినందుకు హరిప్రసాద్ చౌరాసియాకు, సంతూర్ కళాకారుడు పండిట్ శివకుమార్ శర్మకు ఈ అవార్డు అందజేసినట్టు ఆ సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు యువ సినీ కళాకారులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అలాగే మ్యాస్ట్రో అవార్డుకు చౌరాసియా, శర్మలు అర్హులని పేర్కొంటూ తన ఉన్నత మనస్తత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విజిలింగ్ వుడ్స్ సంస్థలో శిక్షణ పొందిన 200 మందికి పట్టా ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News