: కోర్టులన్నీ ఇక ఆన్ లైన్ లో అనుసంధానం
దేశంలోని కోర్టులన్నింటిని అనుసంధానం చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. నూతనంగా రూపొందించిన ఈ-కోర్టు ప్రాజెక్టుతో రాష్ట్రాల కోర్టులన్నీ సుప్రీంకోర్టుతో నిరంతరాయంగా ఆన్ లైన్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టులను అనుసంధానం చేసే ప్రక్రియ త్వరితగతిన సాగుతోందని ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ రమణ వెల్లడించారు.
వారిరువురు ఈ రోజు నాంపల్లి కోర్టు ఆవరణలో న్యాయసేవ విభాగం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, న్యాయవాదులు వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఈ కేంద్రం ద్వారా పొందవచ్చని అన్నారు. కేసులకు సంబంధించిన ప్రతి చిన్న అంశం కూడా అందుబాటులో ఉంటుందని జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ రమణ వెల్లడించారు.