: సచినే ది బెస్ట్.. ఇవిగో రుజువులు..
భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచే రీతిలో సచిన్ టెండూల్కర్ ఘనతలపై పెదవి విరిచిన ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ కు ఈ గణాంకాలే జవాబు చెబుతాయి. సచిన్ కంటే విండీస్ దిగ్గజం బ్రయాన్ లారానే తన జట్టుకు ఎక్కువ విజయాలందించాడని, ఆ విధంగా లారానే బెస్ట్ అని పాంటింగ్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ గణాంకాలు చూస్తే.. ఎవరు బెస్ట్ అనే విషయం తెలిసిపోతుంది.
సచిన్
ఆడిన వన్డేలు: 463, గెలిచినవి: 234, ఓడినవి: 200, ఫలితం తేలనివి 29 (విజయాల శాతం 50.54)
లారా
ఆడిన వన్డేలు: 299, గెలిచినవి: 139, ఓడినవి: 144, ఫలితం తేలనివి 16 (విజయాల శాతం 46.49)
సచిన్
ఆడిన టెస్టులు: 198, గెలిచినవి: 70, ఓడినవి: 56, డ్రాలు: 72 (విజయాల శాతం 35.35)
లారా
ఆడిన టెస్టులు: 131, గెలిచినవి: 32, ఓడినవి: 63, డ్రాలు: 36 (విజయాల శాతం 24.43)
టెస్టుల్లో ఆసీస్ పై (పాంటింగ్ కెప్టెన్సీలో)
సచిన్
11 టెస్టులు, 1352 పరుగులు, 4 సెంచరీలు (సగటు 71.16)
లారా
4 టెస్టులు, 386 పరుగులు, 1 సెంచరీ (సగటు 48.25)
ఆసీస్ పై వీరిద్దరూ ఆడిన టెస్టుల ఫలితాలు (పాంటింగ్ కెప్టెన్సీలో)
సచిన్
11 టెస్టులు, గెలిచినవి 6, ఓడినవి 2, డ్రాలు 3
లారా
4 టెస్టులు, గెలిచినవి 0, ఓడినవి 4