: అపురూప బాలీవుడ్ చిత్రంగా 'మొఘల్-ఏ-అజమ్'


విడుదలై 50 ఏళ్లు దాటిపోయినా 'మొఘల్-ఏ-అజమ్' ఇంకా ప్రజల మనసుల్లో పదిలంగానే ఉంది. ఇప్పటికీ బాలీవుడ్ లో గొప్ప చిత్రరాజంగా ఇది కీర్తినందుకుంటోంది. '100 ఏళ్ల భారతీయ సినిమా' ప్రత్యేకతను పురస్కరించుకుని బ్రిటిష్ ఏషియన్ వార పత్రిక 'ఈస్ట్రన్ ఐ' బ్రిటన్ లో ఒక సర్వే నిర్వహించింది. అందులో 'మొఘల్-ఏ-అజమ్' ట్లాప్ ప్లేస్ లో నిలిచింది. 1960 ఆగస్ట్ 5న ఈ చిత్రం విడుదలైంది. ఇందులో మధుబాల, దిలీప్ కుమార్ జోడీగా నటించారు. షోలే రెండో స్థానంలో నిలిచింది.

'మొఘల్-ఏ-అజమ్' గొప్ప చిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆ చిత్ర దర్శకుడు ఎ.అసిఫ్ కుమారుడు అక్బర్ అసిఫ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబం మొత్తానికి గర్వకారణమన్నారు.

  • Loading...

More Telugu News