: గవాస్కర్ తో కలిసి నాగార్జున బిజినెస్


సెలబ్రిటీల కన్ను ఇప్పడు ఐబీఎల్ పై పడింది. ఐపీఎల్ తెలుసు, ఇప్పుడీ ఐబీఎల్ ఏంటా, అనుకుంటున్నారా? అదేనండీ, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్. ఐబీఎల్ ఫ్రాంచైజీల కోసం ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, టాలీవుడ్ కథానాయకుడు నాగార్జున, భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ చాముండేశ్వరినాథ్ కలిసి ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.

ఐబీఎల్ ఆగస్టు 14 నుంచి 31 వరకు జరగనుంది. హైదరాబాద్, పుణె, లక్నో, ముంబై, ఢిల్లీ, బెంగళూరు జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ స్టార్లు ఇందులో పాల్గొంటారు. ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ యజమానులైనందుకు గవాస్కర్, నాగార్జున ఎంతో ఆనందంగా ఉన్నారని చాముండేశ్వరినాథ్ చెప్పారు. వీరిద్దరికీ షటిల్ బాడ్మింటన్ అంటే ఎంతో మక్కువన్నారు. తమ జట్టులో భారత అగ్రశ్రేణి తారలు ఉంటారని చెప్పారు. ఆటగాళ్ల వేలం కొద్దిరోజుల్లో జరగనుందని, ఉత్తమ ఆటగాళ్ళను సొంతం చేసుకుంటామని చెప్పారు. మరోవైపు పుణె పిస్టన్స్ ఫ్రాంచైజీని డాబర్ గ్రూపునకు చెందిన బర్మన్ కుటుంబ సభ్యులు 6 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News