: తెలంగాణపై వైఎస్ఆర్సీపీది రెండు నాల్కల ధోరణి : గండ్ర
తెలంగాణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి విమర్శించారు. సరైన అభిప్రాయం చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫీజు రీయింబర్స్ మెంటుపై దొంగ దీక్షలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి దీక్షలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గండ్ర సూచించారు.