: ఈ 'చిట్టి' ప్రమాదాల్లో కాపాడుతాడు


రోబో సినిమాలో అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో 'చిట్టి' రోబో రజనీకాంత్‌ రివ్వుమని ఎగిరి వెళ్లి మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతాడు కదా... అచ్చు అలాగే ఒక రోబో తయారయ్యాడు. వీడి పేరు చిట్టి మాత్రం కాదు. కానీ మనం వెళ్లలేని ప్రాంతాలకు కూడా వెళ్లి సునాయాసంగా సహాయం అందించగలడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ ఒక మరమనిషిని తయారు చేసింది. ఈ రోబో పేరు 'అట్లాన్'. వీడు చక్కగా మనుషులు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కూడా సునాయాసంగా వెళ్లగలడు. అణుప్రమాదాలు వంటివి సంభవించిన సమయాల్లో అట్లాన్ చక్కగా వెళ్లి సాయం చేస్తాడట. ఇటీవల జపాన్‌లోని పుకుషిమాలో జరిగిన అణు ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా వణికించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఇలాంటి అణుప్రమాదం సంభవిస్తే అప్పుడు ఎలాంటి పరిష్కారాలు ఆలోచించాలి? అనే దిశగా పెంటగాన్‌ పరిశోధన సాగించింది.

ఈ నేపధ్యంలో జపాన్‌ తరహాలో మరోసారి అణు ప్రమాదాలు సంభవిస్తే ఎలాంటి పరిష్కారాలు కనుగొనాలి? అనే అంశపై 'విర్చువల్‌ రోబోటిక్‌ ఛాలెంజ్‌'ను ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పెంటగాన్‌కు చెందిన ఆధునిక రక్షణ పరిశోధన పథకాల సంస్థ (డీఏఆర్‌పీఏ) ఈ అట్లాస్‌ను రూపొందించింది.

  • Loading...

More Telugu News