: ఫోన్‌తో క్యాన్సర్‌ను గుర్తించొచ్చు!


మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉందా... అయితే మీకు రొమ్ము క్యాన్సర్‌ వస్తుందా? రాదా? అనే విషయాన్ని దానితో ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే, మీకు రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది అనే విషయాన్ని ముందుగానే గమనించిన మీ ఫోన్‌ మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి ఒక యాప్‌ను పరిశోధకులు గుర్తించారు.

ఆష్ట్రేలియాలోని జాతీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత సంతతికి చెందిన విద్యార్ధి సంజయ్‌ శ్రీకుమార్‌ రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే ఒక యాప్‌ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం సమాజంలో ఎక్కువమంది రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దీంతో ప్రజలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగించే దిశగా శ్రీకుమార్‌ ఈ యాప్ ను అభివృద్ధి చేశాడు. ది యంగ్‌ అడల్ట్స్‌ అనే ఒక సంస్థ రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ సంస్థ కోసం శ్రీకుమార్‌ ఈ యాప్ ను అభివృద్ధి చేశాడు. మనకు క్యాన్సర్‌ పరీక్షల గురించి మన ఫోన్‌ మనల్ని హెచ్చరించాలంటే మొదట ఈ యాప్ ను మన స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోవాలి. నమోదు చేసిన వివరాలను సేవ్‌ చేసుకుని ఆ సమాచారాన్ని విశ్లేషిస్తూ క్యాన్సర్‌ లక్షణాలు కనిపించిన వెంటనే మన ఫోన్‌ మనల్ని హెచ్చరిస్తుంది. తర్వాత మనం చేయించుకోవాల్సిన పరీక్షల వివరాలను కూడా తెలియజేస్తుంది. వైఏపీ (యాప్) పేరిట లభ్యమయ్యే ఈ పరిజ్ఞానం గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతోంది కూడా!

  • Loading...

More Telugu News