: రేపటి నుంచి యాషెస్ రెండో టెస్టు


ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో రెండో టెస్టు రేపు లార్డ్స్ మైదానంలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో నెగ్గగా.. ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ శిబిరం భావిస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తొలి టెస్టులో నెగ్గిన కుక్ సేన ఐదు టెస్టులో సిరీస్ లో 5-1తో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, మొదటి టెస్టులో 10 వికెట్లు తీసిన జిమ్మీ ఆండర్సన్ పై ఇంగ్లండ్ మరోసారి ఆశలు పెట్టుకుంది. ఈ కొత్త బంతి బౌలర్ రెండు ఇన్నింగ్స్ లలోనూ ఐదేసి వికెట్లు తీసి కంగారూలను ఇక్కట్లపాల్జేశాడు. ఇదిలావుంటే, ఆసీస్ ను టాపార్డర్ కష్టాలు వేధిస్తున్నాయి. ఒక్కరూ నిలకడగా ఆడకపోతుండడంతో బ్యాటింగ్ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ ఖవాజా జట్టులోకి రావచ్చని ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ సూచనప్రాయంగా వెల్లడించాడు.

  • Loading...

More Telugu News