: కేజీ బరువు తగ్గితే గ్రాము బంగారం కానుక... దుబాయ్ కొత్త ప్లాన్
ఆధునిక ఆహారపు అలవాట్లతో పెరిగిపోతున్న ఊబకాయాన్ని అదుపు చేసేందుకు దుబాయ్ నగరపాలక సంస్థ అధికారులు సరికొత్త ప్రణాళిక రచించారు. ధనికుల దేశంగా పేరొందిన దుబాయ్ లో ఉబకాయం బారిన పడుతున్నవారు అధికంగా ఉన్నారు. దీంతో ఒబేసిటీ బాధితులను సరికొత్త ఆఫర్ తో దుబాయ్ నగరపాలక సంస్థ అధికారులు ఊరిస్తున్నారు. ఈ ఆఫర్ ప్రకారం 30 రోజుల్లో ఎన్ని కేజీల బరువు తగ్గితే కేజీకో గ్రాము చొప్పున బంగారం ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. అది కూడా కనిష్ఠంగా రెండు కిలోగ్రాముల బరువన్నా తగ్గితేనే లెక్కిస్తామంటున్నారు. పాశ్చాత్య ఆహారపుటలవాట్లను తగ్గించేందుకు ఇదో చక్కని ఉపాయమని దుబాయ్ నగరపాలక అధికారులు అభిప్రాయపడుతున్నారు.