: 1000 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం!: బొత్స
వెయ్యి వరకూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావచ్చని అంచనా వేస్తున్నామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ఏకగ్రీవం కానున్న పంచాయతీల్లో సగం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. కోర్ కమిటీ భేటీ గురించి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజిస్తే కొన్నేళ్లపాటు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని కోరినట్టు తెలిపారు. అయితే, రాష్ట్ర విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందనే వాదన సరికాదన్నారు. అధిష్ఠానానికి ఇచ్చిన నివేదికలో రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని బొత్స తెలిపారు.