: రాజధానిని కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించం: కోదండరాం


హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించేది లేదని టీజేఏసీ కన్వీనర్ ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగితే రాజ్యాంగం ప్రకారం సంక్రమించే హక్కులన్నీ నగరంలోని సీమాంధ్ర ప్రజలకు వర్తిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీకి సమర్పించిన రోడ్ మ్యాపులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నక్సలిజాన్ని నిర్మూలించామని చెప్పిన సీఎం, డీజీపీలు నక్సలిజంపై వ్యాఖ్యలు మానాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News