: తాను మగరాయుడ్నంటున్న సోనమ్ కపూర్
తాజాగా రిలీజైన సినిమాలు వరుసగా విజయాలబాట పట్టడంతో సంబరాల్లో ఉన్న సోనమ్ కపూర్ తన కోసం సినిమాలు తీయమని తన తండ్రిని ఎప్పుడూ అడగలేదని, తన తండ్రి పేరు ప్రతిష్ఠలతో సంబంధం లేకుండా ప్రతిభ ఆధారంగా ఈ ఆరేళ్లు సినిమా రంగంలో ఉన్నానని తెలిపింది. తన తాజా సినిమాలు 'రాన్ జానా', 'భాగ్ మిల్కా భాగ్' సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న సోనమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటోంది.
ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎవరినీ ఏదీ అడగాలని అనుకోనని, ఆ విషయంలో తాను మగరాయుడ్నేనని తెలిపింది. అందుకే తన తండ్రిని కూడా సినిమాల విషయంలో సాయం చేయాలని అడగనని తెలిపింది. తన తండ్రి కష్టపడి 40 ఏళ్లు సంపాదించిన సంపాదన, పేరు ప్రతిష్ఠలు అనవసరంగా వృథా చెయ్యనని చెప్పింది. దీంతో, ఎంతైనా అనిల్ కపూర్ కూతురా, మజాకా? అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు.