: పాకిస్తాన్ కు వచ్చేయమ్మా..: మలాలాకు తాలిబాన్ ఫైటర్ విజ్ఞప్తి


తాలిబాన్ల దాడిలో తీవ్ర గాయాలపాలై కోలుకున్న సాహస బాలిక మలాల యూసఫ్ జాయ్ తిరిగి పాకిస్తాన్ రావాలంటూ తాలిబాన్ పోరాట యోధుడు అద్నాన్ రషీద్ కోరాడు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశాడు. 'మలాల తిరిగి పాకిస్థాన్ కు వచ్చేయ్. ఇస్లామిక్, పష్తూన్ సంస్కృతిని పాటించు. ఏదైనా మదరసాలో చేరి, అల్లా గురించి చదివి, పరిశోధించు. నీ రచనా నైపుణ్యాన్ని ఇస్లాం కోసం ఉపయోగించు' అని రషీద్ పిలుపునిచ్చాడు.

అంతేకాక 'తాలిబాన్లు నీపై దాడి చేయరు. ఎందుకంటే, నువ్వు పాఠశాలకు వెళ్లే బాలికవు. చదువంటే ఇష్టం ఉన్న దానివి. తాలిబాన్లు లేదా ముజాహిద్దీన్ ఎప్పుడూ బాలబాలికల చదువుకు వ్యతిరేకం కాదు అని తెలుసుకో. నువ్వు వారికి వ్యతిరేకంగా నీ రచనల ద్వారా రెచ్చగొట్టే విధంగా స్వాత్ ప్రాంతంలో తప్పుడు ప్రచారం చేస్తున్నావేమోనని అనుకున్నారు' అని తన లేఖలో వివరించాడు. ఈనెల 15వ తేదీతో రాసి ఉన్న ఈ లేఖను ఈరోజు మీడియా ఎదుట బహిర్గతం చేశారు. కాగా, తాలిబాన్ గా మారిన రషీద్ పాకిస్తాన్ వాయుసేన మాజీ ఉద్యోగి.

  • Loading...

More Telugu News