: 128 పంచాయతీలు ఏకగ్రీవం


రాష్ట్రంలో ఇప్పటివరకూ 128 పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్నారు. అనంతపురం జిల్లాలో 41 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా తాడిపత్రిలో 20 పంచాయతీల సర్పంచులు స్థానికుల మనస్సు గెలుచుకున్నారు. కడప జిల్లాలో 11 పంచాయతీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 9, మెదక్ లో 3, ప్రకాశం జిల్లాలో 9 పంచాయతీలు సర్పంచులను బేధాభిప్రాయాలు లేకుండా ఎన్నుకున్నాయి. కర్నూలు జిల్లాలో 38 పంచాయతీలు ఎన్నికల అవసరం లేకుండా సర్పంచులను డిసైడ్ చేశాయి. కాగా.. వేలంపాటలు, ప్రలోభాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన పంచాయతీల ఫలితాలను పెండింగ్ లో ఉంచాలని, ఇప్పుడే ప్రకటించొద్దని గుంటూరు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News