: దురుసు ప్రవర్తనతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డ పేసర్ శ్రీశాంత్


ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మరోసారి మైదానంలో తన ప్రతాపం చూపించాడు... అయితే ఆటలో కాదులెండి... నోటి దురుసుతనంలో! దీంతో బీసీసీఐ అతనిపై మరోసారి చర్యలు తీసుకుంది. సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ టోర్నమెంటులో వన్డేలు ఆడాల్సిన శ్రీశాంత్ ను రెండు మ్యాచులకు గానూ నిషేధం విధించింది. ఈనెల 18న మార్గోవా క్రికెట్ క్లబ్ మైదానంలో తమిళనాడుతో జరిగిన మ్యాచులో తమిళనాడు జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తుండగా పేసర్ శ్రీశాంత్ అంపైర్ తో ఘర్షణ పడ్డాడు.

దీంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించిన అతనిపై దినేష్ కార్తీక్ మ్యాచ్ రిఫరీకీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు  చేశాడు. రిఫరీ ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించిన బోర్డు క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఇదే మ్యాచుకు హాజరైన జాతీయ సెలెక్టర్ రోజర్ బిన్నీ కూడా శ్రీశాంత్ స్వభావం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, తన ప్రవర్తనపై శ్రీశాంత్ చివర్లో విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు!

  • Loading...

More Telugu News