: రిక్షావాలా ఇంజెక్షన్... బాలిక మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో చెప్పే ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల చిన్నారికి ప్రభుత్వాసుపత్రిలో ఓ రిక్షా కార్మికుడు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆ బాలిక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బాలియా జిల్లాలో జరిగిందీ ఘటన. కాగా, ఈ రిక్షావాలా ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స వార్డులో రోజూ పని చేస్తాడని తెలుస్తోంది. రోగులకు ఇంజెక్షన్లు చేయడం, కట్లు కట్టడం, మందులివ్వడం వంటి పనులన్నీ చక్కబెడతాడు. కానీ నెలల పసికందుపై తన అరకొర అనుభవాన్ని ప్రదర్శించి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సదరు రిక్షావాలాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.