: పార్లమెంటు వద్ద టీ ఎంపీల బైఠాయింపు
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మళ్ళీ పార్లమెంటు భవనం వద్ద ధర్నా చేబట్టారు. సభలో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టాలంటూ పెద్దగా నినాదాలు చేస్తూ, పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద వారు బైఠాయించారు. ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పరిశీలకుడు వాయిలార్ రవి, వారిని తన వద్దకు రావాల్సిందిగా కబురు పంపారు.