: బాక్సర్ మేరీ కోమ్ స్వగ్రామంలో ప్రియాంక
బాక్సర్ మేరీ కోమ్ పాత్రకు న్యాయం చేసేందుకు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా పరితపిస్తోంది. ఇందుకోసం మేరీకోమ్ స్వగ్రామమైన మణిపూర్ లోని చురచందపూర్ జిల్లా కంగతెల్ కు చేరుకుంది. మేరీ కోమ్ బాక్సింగ్ లో ఎలా ఎదిగింది, ఆ పరిసరాలు, అక్కడి వ్యక్తుల జీవన విధానాన్ని స్వయంగా తెలుసుకోనుంది.
ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చిన మేరీ కోమ్ ఒలింపిక్ పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా బాక్సర్ గా చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. మేరీ కోమ్ విజయప్రస్థానంపై సంజయ్ లీలా బన్సాలీ తాజాగా సినిమా తీస్తున్నారు. మేరీ కోమ్ పాత్రను ప్రియాంకా చోప్రా చేస్తోంది. అధ్యయనంలో భాగంగా రెండురోజుల పాటు ప్రియాంక, మేరీకోమ్ స్వగ్రామానికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఆమె మేరీ కోమ్ తల్లిదండ్రులను కలుసుకుంది. అనంతరం మేరీకోమ్ బాక్సింగ్ కోచ్ ఇబోంచా సింగ్ తోనూ భేటీ అయింది.