: ప్చ్.. ధోనీ 'హెలికాప్టర్ షాట్' మిత్రుడు కన్నుమూత


ధోనీ సాయం ఫలితాన్నివ్వలేదు. చిన్ననాటి మిత్రుడు, రంజీ సహచరుడు సంతోష్ లాల్ ను అనారోగ్యం నుంచి గట్టెక్కించాలనుకున్న టీమిండియా కెప్టెన్ కు విషాదమే మిగిలింది. క్లోమ గ్రంథి సమస్యతో బాధపడుతున్న సంతోష్ నేడు ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. గతకొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న సంతోష్ పరిస్థితి సోమవారం మరీ విషమించడంతో ధోనీ తన స్వంత ఖర్చుతో ఎయిర్ అంబులెన్స్ లో హుటాహుటీన ఢిల్లీ తరలించాడు. అప్పటికే కోమాలోకి జారుకున్న సంతోష్ ఈ ఉదయం మరణించాడు. కాగా, ధోనీ ట్రేడ్ మార్క్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్ సృష్టికర్త సంతోషే. పలు వేదికలపై ధోనీ ఈ విషయాన్ని చెప్పాడు. మిత్రుడి దగ్గరే ఈ షాట్ అభ్యసించానని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News