: నిండుకుండల్లా ప్రాజెక్టులు


రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, శ్రీరాంసాగర్, కల్యాణి ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తుంగభద్రలో ప్రస్తుత నీటిమట్టం 1626.60 అడుగులు ఉండగా, ఇన్ ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1062 అడుగులకు చేరుకోగా, ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే కల్యాణి ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ప్రాంతంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News