: పసివారిముందు కంప్యూటర్లు చిన్నబోతాయి!


పిల్లలకున్న పాటి బుద్ధి, జ్ఞానం లేదా... అంటూ కోపం వచ్చినపుడు ఎదుటివారిని తిట్టడం మనం వింటూంటాం. అయితే పసివారికున్నపాటి తెలివితేటలు కంప్యూటర్లకు కూడా లేవట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే తేల్చారు. చిన్న పిల్లలే కదా అనుకోవడం కాదు. వారి తెలివితేటల ముందు ప్రపంచంలోనే అత్యంత తెలివైన కంప్యూటర్లుగా పేరొందినవి కూడా దిగదుడుపేనట!

అమెరికాలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ నిపుణులు కృత్రిమ మేధస్సును, మానవ మేధస్సుతో పోల్చి చూశారు. ఇందుకోసం వారు ప్రముఖ పరిశోధనా సంస్థ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ రూపొందించిన 'కాన్సెప్ట్‌ నెట్‌4' అనే కృత్రిమ మేధస్సు కంప్యూటర్‌ వ్యవస్థను తీసుకున్నారు. ఈ కంప్యూటర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కృత్రిమ మేధో వ్యవస్థలో ఒకటి. దీనికి చిన్న పిల్లలకు పాఠశాలల్లో నిర్వహించే ఐక్యూ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక సాధారణ విద్యార్ధికుండే మేధస్సునే ఈ కంప్యూటర్‌ కూడా ప్రదర్శించిందని, పైగా పలు సందర్భాల్లో ఇది సాధించిన మార్కుల్లో చాలా తేడాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్డ్‌ స్లోవన్‌ చెబుతున్నారు. అంటే కంప్యూటర్‌కన్నా మన చిన్నారి పిడుగులే మిన్నేగా!

  • Loading...

More Telugu News