: ఫిబ్రవరి 28కి వాయిదా పడ్డ కడప డీసీసీబీ ఎన్నిక
ఇవాళ జరగాల్సిన కడప డీసీసీబీ ఎన్నికలు శాంతి భద్రతల దృష్ట్యా మరికొన్ని రోజులు వాయిదా పడ్డాయి. ఎన్నికల అధికారి కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో గురువారం ఎన్నికలు నిర్వహిస్తామని ముందుగా కడప జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను ఫిబ్రవరి 28కి వాయిదా వేస్తున్నట్లు ఇవాళ తెల్లవారుజామున కలెక్టర్ ప్రకటన జారీ చేశారు.