: మన బుద్ధి ఎలాంటిదో వెంట్రుక చెబుతుంది


అన్నం ఉడికిందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అంటుంటాం. అయితే ఒక్క వెంట్రుకతో మన బుద్ధి ఎలాంటిది అని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరీ అబ్బాయిల విషయంలో ఇది మరింత మంచిదనే చెబుతున్నారు. ఎందుకంటే పెళ్లికాని పిల్లలకు అబ్బాయిలను వెతకడంలో జాతకాలు వంటి వాటికన్నా కూడా సదరు పెళ్లికొడుకు వెంట్రుకతో వాడి బుద్ధి ఎలాంటిది అనే విషయాన్ని ఇట్టే పసిగట్టేయవచ్చని, దీంతో ఆ వరుడుకి 'ఎస్‌' ఆర్‌ 'నో' చెప్పేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తల్లిదండ్రులు తమ కుమార్తెకు తగిన వరుడిని ఎంపిక చేయడంలో అనేక విషయాలను గమనిస్తారు. అయితే ఇన్ని చేసినా కూడా వారి కాపురం కలకాలం నిలిచే విషయం కాస్త సంశయమే. కొంత కాలం తర్వాత సదరు వరుడి బుద్ధి బయటపడుతుంది, కాపురం కొల్లేరవుతుంది. ఇలా కాకుండా పెళ్లికాకముందే మన జీవిత భాగస్వామి అసలు రంగును గుర్తించే ఒక డీఎన్‌ఏ పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన ఈ పరీక్షను నిర్వహించాలంటే మనకు కాబోయే జీవిత భాగస్వామికి చెందిన ఒక వెంట్రుకను తెస్తే సరిపోతుంది. ఆ వెంట్రుక ద్వారా వారి బుద్ధిని బట్టబయలు చేయవచ్చు.

శాస్త్రవేత్తలు ఈ పరీక్షకోసం నానోపోర్‌ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ అనే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ పరీక్ష నిబద్ధతకు సంబంధించిన ఆక్సిటోసిన్‌, విశ్వనీయతకు సంబంధించిన వాసోప్రెసిన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్లను నియంత్రించే జన్యువులను పరిశీలించడం ద్వారా పనిచేస్తుంది. దీనిద్వారా పరీక్షకు గురయ్యేవారు తమ వైవాహిక సంబంధానికి దీర్ఘకాలం పాటు కట్టుబడి ఉంటారా? లేక మోసానికి పాల్పడతారా? అనే విషయాలు వెల్లడవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకనేం... మీకు వివాహం నిశ్చయమైవుంటే వెంటనే మీ జీవితంలోకి వచ్చే భాగస్వామి వెంట్రుకపోగుతో వారి బుద్ధిని తెలుసుకోండి.

  • Loading...

More Telugu News