: ఒకటే పరికరం... మూడు వాయిద్యాలు


పరికరం మాత్రం ఒకటే కనిపిస్తుంది. కానీ, అందులో నుండి మూడు రకాల వాయిద్యాలకు సంబంధించిన ధ్వనులను వినిపించవచ్చు. ఇలాంటి సరికొత్త పియానోను సాంకేతిక నిపుణులు తయారు చేశారు. ఈ పియానో నుండి గిటార్‌, వయొలిన్‌ వాయిద్య పరికరాలకు సంబంధించిన రాగాలను కూడా పలికించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

లండన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సాంకేతిక నిపుణులు, సంగీతకారులు కలిసి ఒక పియానోను తయారు చేశారు. ఈ పియానోకు కీబోర్డు సాయంతో వయోలిన్‌, గిటార్‌ రాగాలను కూడా పలికించేలా దీన్ని సాంకేతిక నిపుణులు రూపొందించారు. దీనిపై కీబోర్డు సాయంతో గతంలో ఎన్నడూ చేయనటువంటి ప్రయోగాలను కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కీబోర్డులోని ప్రతి కీ 26 సెన్సర్లతో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ టచ్‌స్క్రీన్‌లాగే ఈ కీ కూడా పనిచేస్తుంది. దానిపై వేలి ద్వారా పడే ఒత్తిడిని బట్టి అది ధ్వనిని వినిపిస్తుంది. అంటే ఒక కీ పైన వేలిని పైకి, కిందికి కదిలిస్తే అందులో నుండి వయొలిన్‌ ధ్వని వినిపిస్తుంది. అదే కీ ని కొద్దిగా వంచి కదిలిస్తే ఆ కీ నుండి గిటార్‌ ధ్వని వినిపిస్తుంది. ఇలాంటి కొత్త రకం పియానోను ఏమంటామో... ?!

  • Loading...

More Telugu News