: సినీ నిర్మాతలకు మెడిక్లెయిమ్
సినీ నిర్మాతల ఆరోగ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నిర్మాతల మండలి కోటిన్నర రూపాయలతో మెడిక్లెయిమ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాలసీ విధానం ద్వారా సుమారు 800 మంది నిర్మాతలకు లబ్ది చేకూరనున్నట్టు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాతలంతా ఈ మెడిక్లెయిమ్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 27 వ తేదీ వరకూ నోవా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించుకోవాలని నిర్మాతలకు కళ్యాణ్ సూచించారు.