: పాదచారులను బలిగొన్న లారీ


చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడిలో ఒక మినీ లారీ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కొంగారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన శివకుమార్(26) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, సుప్రియ(22), బాలాజీ(24)లు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News