: ఈ ఏడాది రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్టు: మంత్రి ఆనం
లోక్ సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన ఓటు బ్యాంకు అయిన రైతులను ఆకర్షించే పనులకు రాష్ట్ర సర్కారు నడుం బిగిస్తోంది. అందులో భాగంగా వచ్చే రాష్ట్ర బడ్జెట్టును రైతులకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందుకు తగ్గట్టుగా, 'ఈ ఏడాది రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నట్టు' రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, రైతుల రుణమాఫీ చేసే పరిస్థితిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు.