: అవన్నీ ఊహాగానాలే: దిగ్విజయ్
తెలంగాణ అంశానికి పరిష్కారం చూపే క్రమంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్టు వస్తున్న వార్తలన్నీ వట్టి ఊహాగానాలే అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అధిష్ఠానం ఈ విషయమై కసరత్తులు చేస్తోందని, ఈ తరుణంలో వివరాలు వెల్లడించడం భావ్యం కాదని డిగ్గీ రాజా అన్నారు. ఇక, సీఎం కిరణ్ కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో సమర్పించిన రోడ్ మ్యాప్ వివరాలు బహిర్గతం చేయబోనని ఆయన చెప్పారు.