: సమ్మెకు దిగుతాం... ప్రభుత్వానికి జూడాల హెచ్చరిక
తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. స్టైఫండ్ పెంచడంతో పాటు గతంలో తాము సమ్మె విరమించిన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిని 22 వ తేదీ లోగా నెరవేర్చాలని, లేని పక్షంలో తాము మరోసారి సమ్మెకు దిగుతామంటూ జూడాలు ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చారు.