: అమితాబ్ ఎనర్జీకి అచ్చెరువొందిన నాగ్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎనర్జీకి టాలీవుడ్ నటుడు నాగార్జున ఆశ్చర్యపోయాడు. అరవై సంవత్సరాల వయసులోనూ అమితాబ్ శక్తి తనకు ఆశ్చర్యం కలిగించిందని స్వయంగా నాగ్ తెలిపాడు. ఇప్పటికీ నటన పట్ల ఆయనకు ఉన్న తపన ఏమాత్రం తగ్గలేదన్నాడు. 'అమితాబ్ ఒక లెజెండ్. ఆయన్ను చూసిన నేను విస్మయానికి గురయ్యాను. ఈ వయసులోనూ బిగ్ బీ పరుగులు, చేస్తున్న పనిపట్ల పాషన్, ఆయన కళ్లలో ఆ ఫైర్ ఇప్పటికీ తగ్గలేదు. ఎల్లప్పుడూ ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు'అని నాగార్జున చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటన కోసం ముంబైలో జరుగుతున్న షూటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.